డయాబెటిస్ వలన కానీ లేదా మరే ఇతర కారణాల వలన కానీ కలిగే హానిని న్యూరోపతి అంటారు. న్యూరోపతి ఉన్న డయాబెటిక్ పేషేంట్ చాలా నొప్పి, బాధ అనుభవిస్తారు.
న్యూరోపతికి కారణాలు:
రక్తంలో అధిక చక్కెర స్థాయిలు చాలా ఎక్కువ కాలం ఉండడం వల్ల, నరాల కణజాలం దెబ్బతింటుంది. క్రమేపీ నరాలు మెదడుకు సంకేతాలను పంపే సామర్థ్యాన్ని కోల్పోవటం జరుగుతుంది. అంతేకాదు, రక్తంలో అధిక చక్కర స్థాయిలు ఉంటే, నరాలకు ఆక్సిజన్ మరియు పోషకాలను సరఫరా చేసే, చిన్న రక్త నాళాలు బలహీనపడతాయి. దీనితో నరాలు ఇంకా దెబ్బతింటాయి. ఇలాంటి కండిషన్ నే డాక్టర్లు డయాబెటిక్ న్యూరోపతి అంటారు.
డయాబెటిస్-సంబంధిత న్యూరోపతిలో ముఖ్యంగా రెండు రకాలున్నాయి. దీనిని నివారించడానికి, మీ రక్తంలో చక్కెరను నిర్వహించడానికి మీ వైద్యుడితో కలిసి పనిచేయండి.
మీ డాక్టర్ డయాబెటిస్-సంబంధిత న్యూరోపతి యొక్క నాలుగు రకాలను ప్రస్తావించడాన్ని మీరు వినవచ్చు. పరిధీయ, అటానమిక్, ప్రాక్సిమల్ మరియు ఫోకల్.
పెరిఫెరల్ నరాలవ్యాధి
ఈ రకం సాధారణంగా కాళ్ళు మరియు పాదాలను ప్రభావితం చేస్తుంది. అరుదైన కేసుల్లో చేతులు, ఉదర భాగాన్ని కూడా ప్రభావితం చేస్తాయి.
లక్షణాలు:
నరాలు లాగటం
తిమ్మిరిలు (ఇది శాశ్వతంగా మారవచ్చు)
మంట (ముఖ్యంగా సాయంత్రం)
నొప్పి
మీ రక్తంలో చక్కెర అదుపులో ఉన్నప్పుడు లక్షణాలు ప్రారంభంలో చికిత్స అందిస్తే నయం అయ్యే అవకాశాలున్నాయి. రొటీన్ గా పని చేసుకోవటంలో ఇబ్బందులు లేకుండా చూడకుండా ఉండేందుకు సహాయపడే మందులు ఉన్నాయి. అందుకు డయాబెటిక్ పేషేంట్ ఈ క్రింద విధంగా చేయాలనీ డాక్టర్లు చెబుతారు.
ప్రతిరోజూ మీ కాళ్ళు మరియు పాదాలను తనిఖీ చేసుకోవాలి.
పొడిగా ఉంటే మీ పాదాలకు ఏదైనా లోషన్ వాడాలి.
పాదాలకు దెబ్బలు తగలకుండా చూసుకోవాలి, అవసరం అయితే సరైన బూట్లు ధరించాలి. పాదాలకు దెబ్బలు తగిలి సరైన చికిత్స అందక లేదా అందినా, చికిత్సకు నయం కానీ కొన్ని కేసులలో పాదాలు తొలగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల పేషేంట్ చాల జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ తో సంప్రదించి షుగర్ ను ఎల్లపుడూ కంట్రోల్ లో ఉంచుకోవాలి.
ఆటోనోమిక్ న్యూరోపతి
ఆటోనోమిక్ నాడీ వ్యవస్థ అనేది ఒక స్వతంత్ర నియంత్రణ వ్యవస్థ, ఇది చాలావరకు అసంకల్పితంగా పనిచేస్తుంది. హృదయ స్పందన, జీర్ణక్రియ, శ్వాస, మూత్రవిసర్జన మరియు లైంగిక ప్రేరేపణ వంటి శారీరక విధులు ఆటోనోమిక్ నాడీ వ్యవస్థ కిందికి వస్తాయి. ఒకవేళ డయాబెటిస్ ఈ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తే అది మరింత జఠిలమైన సమస్యలా మారుతుంది. ఎందుకంటే ఈ రకం న్యూరోపతి సాధారణంగా జీర్ణవ్యవస్థను లేదా మూత్ర వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. డయాబెటిక్ పేషేంట్ ఈ క్రింది లక్షణాలు ఉంటె వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.
ఉబ్బరం
ఒక్కోసారి విరేచనాలు
ఒక్కోసారి మలబద్ధకం
గుండెల్లో మంట
వికారం
వాంతులు
చిన్న భోజనం తర్వాత కడుపు నిండిన అనుభూతి
డాక్టర్లు సాధారణంగా ఇలాంటి పేషేంట్లకు, చికిత్స చేయడానికి సమస్య తీవ్రతను బట్టి మందులను ఇచ్చి, భోజనం తక్కువగా ఎక్కువసార్లు తినవలసి ఉంటుందని సూచిస్తారు.
ఏదేమైనా, షుగర్ అనేది ఎల్లపుడూ కంట్రోల్ లో ఉంచుకోవటం ఉత్తమం.
