డిసెంబర్ 1వ తేదీ నాటి నుండి రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన ప్రతి ఇంటికి నాణ్యత కలిగిన బియ్యాన్ని సరఫరా చేస్తామని, సరఫరా కొరకు 9260 వాహనాలు వినియోగించనున్నామని మంత్రి పేర్ని నాని తెలిపారు. నేడు జరిగిన రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ సమావేశం వివరాలను ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు.
గర్భిణీలు, పిల్లల కోసం 1863 కోట్లతో సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రారంభించిడానికి సర్వం సిద్ధం చేసామన్నారు. సెప్టెంబర్ 5వ తేదీ నుండి వైయస్సార్ విద్యా కానుక పథకం ప్రారంభిస్తున్నామని, ఈ పథకంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు మూడు జతల యూనిఫాం, బూట్లు పుస్తకాలు అందిచనున్నామన్నారు.
