కొన్నేళ్ళ క్రితం సినిమా ప్రదర్శనకు ముందు మద్యపానం ధూమపానం పై ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలో క్యాన్సర్ వ్యాధి సోకడం వలన తన రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది అని చెప్పిన విషయం బాగా పాపులర్ అయింది.
ఇప్పుడు కరోనా కారణంగా రెండు గాజులు కాదు ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆడు ఈడు అని తేడా లేకుండా 0 నుండి 100 వరకూ అందరిని జీవితాలతో పుట్‌బాల్ ఆడుతున్న కరోనా వైరస్, కోటీశ్వరులని కూడా ఇబ్బంది పెడుతుంది.
వైరస్ సోకి కొంతమంది బాధపడితే, అసలు వైరస్ అనేది పుట్టడం వల్ల ప్రజల జీవిన విధానం మీద ఎఫెక్ట్ పడింది, అలాగే ప్రజల ఆర్థిక పరిస్థితులు మీద కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది కరోనా వైరస్.
ఇంక ఆఫీస్‌లకి వెళ్లి ఉద్యోగాలు చేసుకునే ఉద్యోగులు పరిస్థితి అయితే ఇంకా ఘోరంగా తయారయింది. ఇండియాలో చాలా సాప్ట్‌వేర్ నాన్ సాప్ట్‌వేర్ కంపెనీలు సగం పైనే జీతంలో కోతలు పెడితే మరికొన్ని 25% జీతం మాత్రమే ఇస్తున్నాయి. కరోనా కి ముందు రుణాలు తీసుకుని నెల నెలా ఈఎమ్‌ఐ లు కడుతూ ఉండే ఉద్యోగులు పరిస్థితి అయితే మరీ దారుణంగా తయరయినట్టే ఉంది. ఎందుకంటే వచ్చే సగం జీతంతో ఇల్లు గడవడంతో పాటు ఈఎమ్‌ఐ లు కట్టడం ఇబ్బందిగా తయారయింది.
ఇలా ఒక సాప్ట్‌వేర్ మాత్రమే కాదు, మిగతా అన్ని రకాల ఉద్యోగుల పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. సాప్ట్‌వేర్ కంపెనీలని ఆనుకొని ఉన్న చిన్న చిన్న టీ కొట్టు నుండి కాకా హోటల్ వరకూ ప్రతీ ఒక్కరి ఆర్థిక పరిస్థితి మీద చాలా తీవ్రమైన ప్రభావాన్నే చూపించింది కరోనా వైరస్. ఇలా ఒకరేంటి సిటీల నుండి పల్లెటూరు వరకూ ప్రతీ ఒక్కరిని ఒక ఆట ఆడుకుంది ఈ మహమ్మారి.
కరోనా వైరస్ వల్ల ఇండియాలో జరిగిన మార్పులు ఎప్పటికి తిరిగి మళ్లీ సాధారణ స్థాయి కి చేరుకుంటాయో ఇంకా ఎవరికి క్లారిటీ లేదు.
అంతా దేవుడు మీదే భారం.
– S. పుట్టా
