కరోనా కారణంగా లాక్ డౌన్ లో భాగంగా షాపింగ్ మాల్స్, రెస్టారెంట్ల వంటి వాటికి ప్రభుత్వం సడలింపు ఇచ్చినా సినిమా థియేటర్ల యాజమాన్యం మాత్రం నష్టాల్లో ఉంది. ఈ నెలాఖరుతో లాక్ డౌన్ ముగియనుండడంతో సినిమా థియేటర్లకు అనుమతి ఇవ్వనుందని సమాచారం. అయితే సామాజిక దూరం, శానిటైజేషన్, ముఖానికి మాస్క్ వంటి వాటిని పాటిస్తూ థియేటర్లకు అనుమతిని ఇవ్వవచ్చు అని తెలుస్తుంది. ఇప్పటికే పలు థియేటర్లు తెరుచుకునేందుకు యాజమాన్యం అనుమతిని కోరాయి.
