ఇరు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జలకళ సంతరించుకుంది. నదులు, వాగులు, చెరువులు నీటితో నిండి పోయాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భద్రాచలం, ధవళేశ్వరం వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి తరలించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది.
ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలు రాయలసీమ ప్రాంతాల్లో
ఇంకో 48 గంటల పాటు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
