దళితులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, శిరోముండనం, అత్యాచారాలు, భూములు బలవంతంగా లాక్కోవడం, అక్రమ అరెస్ట్ లకు నిరసనగా, రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు వివిధ రూపాల్లో నిరసనలు తెలిపాయి. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకాలు, వినతి పత్రాలు అందించి ఇప్పటికైనా అధికార పార్టీ దళితులపై దాడులు చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని బాధితులకు అండగా నిలిచి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది.