విజయవాడ దుర్గగుడి ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలు వరలక్ష్మి కారులో అక్రమ మద్యాన్ని పోలీసులు గుర్తించారు. తెలంగాణ నుంచి ఆంధ్ర కి వచ్చే దారిలో ఆమె కుమారుడుపై అనుమానం రావడంతో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సీతారాంపురంలో ఆమె నివాసం వద్ద పార్క్ చేసి ఉన్న కారును పోలీసులు తనిఖీ చేయగా.. అక్రమంగా తరలించిన మద్యం సీసాలు బయటపడ్డాయి.
225 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 40 వేల రూపాయల మద్యాన్ని సీజ్ చేశారు. కార్ డ్రైవర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కారు ముందు ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి పాలకమండలి అనే బోర్డుతో పాటు కారును కూడా సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేశారు. ఆమె కుమారుడు చేసిన పని అయినప్పటికీ దుర్గగుడి పాలకమండలి సభ్యురాలుగా ఉంటూ ఆమె కారు ఇలాంటి పనికి పూనుకోవడం తప్పుగా స్థానికులు భావిస్తున్నారు.
