• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

న్యాయ రాజధానిలో… న్యాయానికి కరువు

TrendAndhra by TrendAndhra
August 20, 2020
in Latest News
0 0
0
న్యాయ రాజధానిలో… న్యాయానికి కరువు
Spread the love

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు న్యాయ రాజధానిగా ప్రకటించిన కర్నూల్ లో న్యాయానికి కరువు వచ్చింది.

నాటి టిడిపి హయాంలో కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో అత్యాచారానికి గురై ఆపై హత్య చేయబడిన 14 ఏళ్ల సుగాలి ప్రీతి కేసుపై ప్రభుత్వం ఉదాసీనత పలు విమర్శలకు దారితీస్తుంది.

జన సేన అధినేత పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి తల్లికి మద్దతుగా న్యాయం చేయాలని కర్నూలులో భారీ కవాతు చేసిన అనంతరం ప్రభుత్వం దిగి వచ్చి ఆ కేసులో CBI విచారణకు ఆదేశించి ఇప్పటికీ నాలుగు నెలలు గడుస్తున్నా జరిగిన ఘటనపై ఇప్పటికీ చర్యలు ముమ్మరం చేయలేదు.

చేసింది టిడిపి వాళ్ళే అంటూ నాటి ప్రతి పక్ష నేత జగన్ రెడ్డి గారే మీడియా ముఖంగా చెప్పారు. నేడు ఆయనే అధికారంలో ఉండి కూడా చర్యలు తీసుకోకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారు?
నా బిడ్డ స్థానంలో ఆయన చెల్లి ఉంటే ఇలాగే ఆలోచించే వాళ్ళా అంటూ సుగాలీ ప్రీతి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరో పక్క పబ్లిసిటీ కోసం సెలబ్రిటీలు మీద కాంట్రవర్సీలు చేసే యూట్యూబ్ జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి ఆ కేసును నిర్వీర్యం చేయాలని స్కూల్ యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ తనని మానసికంగా హింస పెడుతుంది అని, ఇలాంటి వాటికి నేను భయపడేది లేదని సుగాలి ప్రీతి తల్లి మీడియా ముఖంగా స్పష్టం చేశారు. ఒక దివ్యాంగురాలైన ఆ తల్లి బిడ్డ కోసం పడే మానసిక వేదనకు,పోరాటానికి ఈ రాష్ట్రంలో న్యాయం జరగదు అని ఈ రెండు ప్రభుత్వాలు తేల్చేశాయి.

దళిత మహిళ హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో దళితులపై దాడులు జరిగినా, దళిత బాలికపై అత్యాచారం జరిగినా అయితే రాష్ట్రపతి స్పందించాలి లేదా ప్రజా పోరాటాలు జరగాలి తప్ప మంత్రి గారు మాత్రం ఎవరికి కనపడరు అని విమర్శలు వస్తున్నాయి. దీన జనులను ఆదుకొలేని దిశా చట్టాలు ఎన్ని చేసినా అవి గాల్లో దీపాల్లాగా ఉంటాయి తప్పితే ఏ ఆడపిల్ల జీవితంలో దీపాన్ని వెలిగించలేవు. సుగాలి ప్రీతి స్థానంలో ఒక అగ్ర కులానికి చెందిన ఆడ పిల్ల ఉంటేనే స్పందన ఎలా ఉండేదో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమని ఓట్ బాంకుగా తప్పితే మనుషులుగా చూడని నాయకులను నమ్మినంత కాలం దళితుల బాధలు అరణ్య రోదనలే అంటూ ప్రజా సంఘాలు,విద్యార్థి సంఘాలు, జనసేన పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Spread the love
Tags: AndhrapradeshJanasenaKurnoolPawan KalyanYsrcp
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.