ప్రముఖ సినీహీరో రామ్ ఒక్క ట్వీట్ తో పరువు పోగొట్టుకున్నాడా? అవుననే అంటున్నారు ఆయన అభిమానులు సైతం. ఆయన చేసిన కామెంట్స్ సామజిక బాధ్యతతో కూడినవి కాదని అందులో బంధుప్రీతి మాత్రమే ఉందని, ఒక కళాకారుడిగా ఆయన తన స్థాయి తగ్గించుకున్నారని అభిప్రాయపడుతున్నారు.
విజయవాడ రమేష్ హాస్పిటల్ ఉదంతంలో ముఖ్యమంత్రి జగన్ ని ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్స్ పై వైసీపీ కార్యకర్తలు భగ్గుమన్నారు. రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో లేకముందు స్వర్ణా ప్యాలెస్ లో అగ్నిప్రమాదం జరిగి ఉంటే ఏం చేసేవారని ఆయన చేసిన కామెంట్స్ పూర్తి భాధ్యతారహితమని ప్రభుత్వం నిర్వహించేది క్వారన్ టెయిన్ కేంద్రం మాత్రమే అని గుర్తు చేశారు.
అక్కడ ప్రమాదవశాత్తు మరణం పాలైన వారిపట్ల రామ్ కనీసం సానుభూతి కూడా చూపలేదని, ఇప్పుడు హాస్పిటల్ యాజమాన్యం తరపున వకాల్తా పుచ్చుకుని ఎలా మాట్లాడతాడని ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. టీడీపీ నాయకులతో రామ్ కి ఉన్న సంబంధాలుని కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీనితో రామ్ ఇక ఆవిషయంపై తాను స్పందించనని మరో మరో ప్రకటన చేయాల్సివచ్చింది. ఇది రామ్ వేసిన తప్పుడుగుగానే భావిస్తున్నారు సినీ విశ్లేషకులు.
