రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న తర్వాత రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని నిరూపించారు ముఖ్యమంత్రి జగన్. రాజకీయంగా ప్రత్యర్ధి పార్టీకి చెందిన వారైనా రాష్ట్రంలో ప్రతి పౌరుడు ప్రభుత్వం నుండి సహాయం పొందగలగాలి.
వివరాల్లోకి వెళితే, పిఠాపురంలో పవన్ అభిమాని అయిన నాగేంద్ర రక్తసంబందిత వ్యాధి తో బాధపడుతున్నాడు. ఈ విషయం పిఠాపురం MLA పెండెం దొరబాబు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా జగన్ తక్షణమే పది లక్షల ఆర్ధిక సహాయం అందించారు. ముఖ్యమంత్రి కార్యాలయం స్పెషల్ ఆఫీసర్ హరికృష్ణ అతని వైద్యానికి సంబంధించిన హాస్పటల్ ఎల్వోసీ అందజేశారు. నాగేంద్ర కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలిపారు.
