స్వాతంత్ర్య దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్ బర్త్ డే ఇంకా రెండు వారాల్లో వస్తున్న సందర్భంగా ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బర్త్ డే CDP తో ఒక ఊపు ఊపేసారు.
“నేను ట్రెండ్ ఫాలో అవను. సెట్ చేస్తా” అన్నది గబ్బర్ సింగ్ మాట…” ట్రెండ్ తో రికార్డులు సెట్ చేసి పెట్టడం” పవన్ ఫాన్స్ బాట. ట్విట్టర్ లో పవన్ ఫ్యాన్స్ రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. ఫ్యాన్స్ వార్ లో ఎపుడూ వాళ్లదే పై చేయి కింద కనిపిస్తూ ఉంది. కంటికి కనిపిస్తున్న అన్ని రికార్డులు తుడిచేస్తూ సరికొత్త రికార్డుల వైపు పరుగులు పెడుతున్నారు.
అడ్వాన్స్‌డ్ బర్త్ డే ట్రెండ్ అయినా, బర్త్ డే సిడిపి ట్రెండ్ అయినా, బర్త్ డే ట్రెండ్ అయినా అన్నిట్లో సరికొత్త రికార్డుల సెట్ చేస్తున్నారు. ఆ విధ్వంసం ఇంకా కొనసాగుతూనే ఉంది, నిన్న సాయంత్రం 6:00 గంటలకి #PawanKalyanBirthdayCDP హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మొదటి 7 నిమిషాల్లోనే మిలియన్ ట్వీట్లు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు.
59 నిమిషాల్లో 9 మిలియన్లు, 67 నిమిషాల్లో 10 మిలియన్ ట్వీట్లతో గంటలో అత్యధిక ట్వీట్ల రికార్డులు సృష్టించారు. ఇప్పటివరకూ 31 మిలియన్ ట్వీట్లతో బిగ్గెస్ట్ బర్తడే CDP గా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. గతవారం మహేష్ బాబు అభిమానులు 24 గంటల్లో 31 మిలియన్లు ట్వీట్లతో రికార్డు నెలకొల్పితే, పవన్ ఫ్యాన్స్ 14 గంటల్లోనే బర్తడే CDP రికార్డు తుడిచేసారు.
సాయంత్రం 6:00 లోపు ఇంకెన్ని రికార్డులు పవన్ ఫ్యాన్స్ దెబ్బకు బలైపోతాయో చూడాలి.