‘ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మొదలైతే పేదవాళ్లకు ఎక్కడ మంచి జరుగుతుందో అనే భయంతో ప్రతిపక్షం రకరకాల చోట్ల కేసులు వేయడం చూస్తున్నాం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా దేవుడి దయతో అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. పేదలకు మంచి జరిగి తీరుతుంది’ అంటూ నేడు స్పందన కార్యక్రమం పై జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
గెలవడానికి కొంచెం సమయం పట్టొచ్చు కానీ అంతిమంగా న్యాయమే గెలుస్తుందని, పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. కానీ ఆ మంచి రోజు వచ్చేలోపు మనం నిరుత్సాహ పడకూడదని, ఆగస్టు 15 న జరగాల్సిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడడం
ఒక విధంగా మంచే జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ లోపు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
