రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్న కరోనా రోగుల సంఖ్య ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. రోగులకు సత్వరం వైద్యం చేసేందుకు ఏర్పాటు చేసిన క్వారయింటైన్ సెంటర్లు,హాస్పిటల్స్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నా తగిన సిబ్బంది లేని కారణంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించడంలో విఫలమైవుతూనే ఉంది.చాలా రాష్ట్రాలతో పోలిస్తే ఆంద్రప్రదేశ్ మరణాల రేటు తక్కువగా ఉండి రికవరీ రేటు ఎక్కువగా ఉండటంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
కాకపోతే ఇదే అదునుగా ప్రయివేట్ హాస్పిటల్స్ కరోనా రోగులని నిలువు దోపిడీ చేస్తున్నాయి.
మెరుగైన సదుపాయాల పేరుతో వారి నుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. గత వారంలో ఎక్కువగా సంఖ్యలో హాస్పిటల్స్ కరోనా రోగులకు చికిత్సకు ముందుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.ప్రభుత్వ హాస్పిటల్స్ పై నమ్మకం లేని చాలామంది రోగులు లక్షల రూపాయలు కేవలం వారం రోజుల వ్యవధిలోనే బిల్లుల రూపంలో చెల్లిస్తున్నారు.
ప్రభుత్వం చికిత్సలో వివిధ దశలకు నిర్దిష్టమైన ధరలు నిర్ణయించినా వాటిని అమలు చేసే పరిస్థితి లేకపోవడంతో ప్రయివేట్ హాస్పిటల్స్ కి వరంగా మారింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ధరల పట్టిక హాస్పిటల్స్ లో పెట్టినా తెర వెనుక భాగోతం వేరేగా ఉందని చాలామంది చెబుతున్నారు. ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఇటువంటి వాటిని కట్టడి చెయ్యడం కష్టమని ప్రజలు భావిస్తున్నారు.