టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన సంగతి అందరికి తెలిసిందే. ఆయన నిష్క్రమణ పై ఇప్పటికీ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఆయన అభిమానులు ధోనీ వీరోచిత ఇన్నింగ్స్ గురించి చర్చించుకుంటున్నారు. ఆయన హయాంలో భారత క్రికెట్ సాధించిన విజయాలు ఎప్పటికీ మరచిపోలేనివని కొనియాడడుతున్నారు.
ఇదిలా ఉండగా, ధోనీకి భారతీయ జనతా పార్టీ నుంచి ఆహ్వానం అందినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన చేరికను స్వయంగా అమిత్ షా కోరుకుంటున్నట్లు ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా కనిపిస్తుంది. ధోని సొంత రాష్ట్రమైన జార్ఖండ్ నుంచి ఆయన కు భాద్యతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి, దేశంలో వివిధ ప్రాంతాల్లో ఆయన సేవలు ఉపయోగించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
భారత్ క్రికెట్ లో ఒక వెలుగు వెలిగిన ధోని రాజకీయాల్లోకి కూడా వస్తే బావుంటుందని మెజారిటీ అభిమానులు కోరుకుంటున్నారు. అక్కడ కూడా ఆయన విజయం సాధించి రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తే ఇక ఆయన అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు.
