బీజేపీ నేత గుడివాక రామాంజనేయులు నిన్న అక్రమ మద్యం తరలిస్తూ దొరికిపోయారు. ఆయన నల్గొండ జిల్లా చిట్యాల నుండి కారులో మద్యం తరలిస్తూ గుంటూరు ఏఈఎస్ చంద్రశేఖర్రెడ్డి జరిపిన దాడుల్లో చిక్కారు. దాడి జరిగిన సమయంలో ఆయన వద్ద ఆరు లక్షల విలువైన మద్యం సీసాలు లభించాయి.
ఆయనతోపాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు ఆయన్ని తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఒక లేఖ విడుదల చేశారు. అసాంఘిక కార్యకలాపాలను పార్టీ ఉపేక్షించదు అని సోము పేర్కొన్నారు. ఆయనపై క్రమశిక్షణ సంఘం తదుపరి చర్యలు తీసుకుంటుందని సోము తెలిపారు. గుడివాక రామాంజనేయులు 2019లో మచిలీపట్నం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.