దిగొచ్చిన బంగారం ధరలు
గత కొంత కాలంగా ఆకాశాన్ని అంటుతున్న బంగారం ధరలు దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.గ్రాముకి 110 తగ్గి రూ.55,650 కి దిగిరాగా
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గ్రాముకి రూ.110 తగ్గుదలతో రూ.51,000కు దిగివచ్చింది.
పూజలు, వ్రతాలు, పెళ్ళిళ్ళతో కళకళలాడే శ్రావణ మాసం లో బంగారం ధరలు తగ్గడం శుభపరిణామం.
ఇకపోతే బంగారం ధర దిగి వస్తుంటే వెండి ధర అమాంతంగా పెరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కిలో వెండి ధర రూ 1050 పెరుగుదలతో 68000 రూపాయలు కావడం విశేషం.
