ప్రముఖ పారిశ్రామిక వేత్త, నిర్మాత వైఎస్ఆర్సిపి నాయకుడైన పొట్లూరి వరప్రసాద్(PVP) తన ట్విటర్ అకౌంట్లో ఈరోజు మెచ్చుకునే ట్వీట్ చేశారు. మహిళా ఉద్యోగినులు ఎదుర్కొనే సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. మాట్లాడకుండా గుట్టుగా ఉంచుతూ బాధపడే రోజులు కాదు. జొమాటో సంస్థ సంవత్సరానికి పది రోజులు ఆడవారికి పీరియడ్ లీవ్ ప్రకటించి, వారు పడే ఇబ్బందుల నుంచి సహకారమందించిది. బీహార్ ప్రభుత్వం నెలకు రెండు రోజులు సెలవు ఇచ్చింది.
“@ysjagan గారు, please consider the same for our working women” అంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విషయంపై ఆలోచించవలసిందిగా మనవి చేస్తూ ట్వీట్ చేయడం అభినందించదగ్గ విషయం. మన భారతీయ సమాజంలో మహిళలను అత్యంత గౌరవంతో చూస్తారు. కానీ వారు పడే ఇబ్బందులను ప్రభుత్వాలు విస్మరిస్తూ ఉంటాయి. పిరియడ్ సమయంలో వారు శారీరకంగా ఎంతో అలసట చెంది ఉంటారు. ఇలా పెద్ద స్థాయి లో ఉన్న నేతలు స్పందించి ఇలాంటి విషయాలు ప్రస్తావించడం వలన దీనిపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది.