కాపు రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు ముద్రగడ పద్మనాభం తాను రిజర్వేషన్లు ఉద్యమం నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన తర్వాత మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఎంతమంది నేతలు వత్తిడి చేసినా ముద్రగడ తన వైఖరి మార్చుకోలేదు. ముద్రగడ వైఖరిపై కాపుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.
ముద్రగడ పై టీడీపీ వరస ఎదురుదాడికి దిగడంతో ఆయన మనస్తాపం చెందారని, వైసీపీ ప్రభుత్వం తో తనకు సత్సంబంధాలు ఉన్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వం తో పోరాడే కార్యాచరణ అమలు చేసే క్రమంలో ముందస్తుగా దాడికి పాల్పడ్డారని సన్నిహితులుతో చెబుతున్నట్లు సమాచారం.
వైసీపీ కూడా కాపుల్ని బీసీల్లో చేర్చే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని,కాపుల ప్రయోజనాల కోసం తన రాజకీయ జీవితం మరియ ఆస్తులు త్యాగం చేశానని ఇప్పుడు అదే సామాజిక వర్గం నుంచి కొంత మంది దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన భావిస్తున్నారు. అన్ని జిల్లాల J A C లు వత్తిడి మేరకు ముద్రగడ తన నిర్ణయం పునః పరిశీలన చేసుకుంటారేమో వేచి చూడాలి.