రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఒక సంచలన కేసు నమోదయింది. ఒక దళిత మహిళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఈ ఫిర్యాదు చేశారు. 139 మంది బలవంతంగా కొన్ని సంవత్సరాలుగా తనపై 5000 వేల సార్లు కు పైగా అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసారు. దీనికి సంబంధించిన నిందితుల వివరాలను, ఆధారాలను ఫిర్యాదుకు జతచేసి అందించారు. సంచలనం సృష్టిస్తున్న ఈ కేసులో బాధిత మహిళ తెలుపుతున్న వివరాలు సభ్య సమాజం తలదించుకునే రీతిలో ఉన్నాయి. తనను నగ్న చిత్రాలు తీస్తూ, ఒప్పుకోకపోతే చంపేస్తామని బెదిరిస్తూ, దారుణాతి దారుణమైన రీతిలో తనపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె పోలీసులకు తెలిపారు.
ఒక స్వచ్ఛంద సంస్థ సహాయంతో వారి వివరాలను సేకరించానని ఆమె మీడియాకు వివరించారు. ఫిర్యాదులో నిందితులుగా పేర్కొన్న వారు సినీ, రాజకీయ, విద్యార్థి సంఘాలకు చెందిన వారు ఉండడం అందరినీ షాక్ కి గురి చేసింది. రెండు రోజుల క్రితం నమోదైన ఈ కేసులో ఈరోజు ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు తో పాటు మరొక 138 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 139 మంది పై ఆమె చేసిన ఫిర్యాదుపై వంద పేజీల ఎఫ్ఐఆర్ ని పోలీసులు సిద్ధం చేశారు. CCS పోలీసుల ఆధ్వర్యంలో కేసు ప్రాథమిక విచారణ జరుగుతుందని పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. పూర్తి నిజా నిజాలు పోలీసుల విచారణలో వెల్లడవుతాయి. ఈ కేసులో బాధిత మహిళకు న్యాయం జరగాలని ఆశిద్దాం.
