తన పదునైన మాటలతో నిత్యం వార్తల్లో నిలిచే గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ కు తెలంగాణ సర్కార్ భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఉగ్రవాదులతో ఆయనకు ముప్పు పొంచి ఉందని, అందుచేత రాజాసింగ్ భద్రత పెంచామని సీపీ అంజన్ కుమార్ వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే, నివాసం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇటీవల వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో భద్రతను పెంచుతున్నట్లు అదేవిధంగా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నట్లు సీపీ తెలిపారు.