కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న క్రమంలో లాక్ డౌన్ కొనసాగిస్తున్నట్లుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తూనే వస్తున్నాయి. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కరోనా ఉధృతి అధికంగా ఉంటే, కొన్ని చోట్ల కొంతమేరకు అదుపులో వున్నట్టు మనకి రోజువారీ లెక్కలు చెబుతూనే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వైద్యపరమైన మౌలిక సదుపాయాలు కల్పనలో కోవిడ్ ప్రారంభం నాటికి ఇప్పటికీ చాలా అభివృద్ధి జరిగిన మాట వాస్తవం.
కాకపోతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కోవిడ్ ఉధృతి తగ్గిందని మరణాల రేటు గణనీయంగా పడిపోయిందని, ఇక ముందు కూడా పరిస్థితి అదుపులోనే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ కొనసాగింపు, ఎత్తివేసే స్వేచ్చని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి ఇచ్చే అవకాశం కేంద్రం పరిశీలిస్తోంది.
దీని ద్వారా రైల్వేల, విమానయాన సంబంధిత సేవలు తిరిగి పునఃప్రారంభం అయ్యే అవకాశం ఉంది. స్కూళ్ళు, మాల్స్, మార్కెట్స్ ప్రారంభంతో మళ్లీ యధావిధిగా అన్ని కార్యకలాపాలు కొనసాగుతాయి. దీనివల్ల కరోనా ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలోనే అన్ లాక్ ప్రక్రియ మొదలైతే ప్రజల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
