పశుగ్రాసం కుంభకోణంలో అరెస్టు అయ్యి జైలు శిక్ష అనుభవిస్తున్న రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ కి జార్ఖండ్ హైకోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. కానీ బెయిల్ వచ్చినా లాలు జైల్లోనే ఉండాల్సిన పరిస్తితులు వచ్చాయి.
లాలు బీహార్‌లో జరిగిన పశుగ్రాసం కుంభకోణం కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే దాణా కేసులో లాలూకు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.
గడ్డి కుంభకోణంలో చాయ్ బసా ట్రెజరీకి సంబంధించిన కేసులో ఆయనకు బెయిల్ వచ్చింది కానీ దుంకా ట్రెజరీ కేసులో మాత్రం ఆయన జైళ్లోనే ఉండాల్సి పరిస్థితి ఉంది.
దాణా కుంభకోణానికి సంబంధించి ఆయన బీహార్ జార్ఖండ్ విడిపోకముందు ఉమ్మడి బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ. 33 కోట్లు కుంభకోణం చేసారనే ఆరోపణలు ఉన్నాయి.