42 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్న హైదరాబాద్ జంట పేలుళ్లు జరిగి నేటికి 13 సంవత్సరాలు పూర్తయింది. లుంబినీ పార్క్, గోకుల్ చాట్ ల వద్ద ఏక కాలంలో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ 2007 ఆగస్టు 25 వ తేదీన పేలుళ్లకు పాల్పడింది. ఆ ఘటనలో 42 మంది మృతిచెందగా 50 మందికి పైగా తీవ్ర గాయల పాలయ్యారు.ఎంతోమంది నాడీ వ్యవస్థ దెబ్బతిని జీవచ్ఛవాలుగా మారిపోయారు.
ఈ కేసులో అనీఫ్ షఫీక్ సయ్యద్ మహమ్మద్ ఇస్మాయిల్ చౌదరి లను దోషులుగా తేల్చి NIA ఉరి శిక్ష విధించింది. కానీ ఇప్పటివరకు శిక్ష అమలు కాకపోవడం గమనార్హం.