కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 4 కు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటించిన వెంటనే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొనే భక్తుల సంఖ్యను పెంచే యోచనలో టీటీడీ ఉంది. ప్రస్తుతం ప్రతి రోజు నాలుగు వేల మందికి దర్శన భాగ్యం లభిస్తుండగా సెప్టెంబరు 1వ తేదీ నుండి ఈ సంఖ్యను పదివేలకు పైగా పెంచే ఆలోచనలో తిరుమల తిరుపతి పాలక మండలి ఉన్నట్లు తెలుస్తోంది.
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనం కోసం దేశ విదేశాల నుండి భక్తులు ఎదురు చూస్తున్నారు.
కానీ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రజల ఆరోగ్యరీత్యా ఎక్కువ స్థాయిలో దర్శనాలకు అనుమతి ఇవ్వడం లేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి విస్తృతంగా ప్రబలిన నేపథ్యంలో టీటీడీ నిర్ణయాలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఎంత వరకు అనుమతి ఇస్తుంది అనేది వేచి చూడాలి.