కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో అధికార పార్టీలో వర్గపోరు మొదలైంది. పార్టీ స్థాపించిన నాటి నుండి నియోజకవర్గంలో పనిచేస్తున్న దుట్టా రామచంద్ర రావుకి అధికారికంగా టిడిపి ఎమ్మెల్యే అయి ఉండి అనధికారికంగా వైసీపీలో కొనసాగుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మధ్య విభేదాలు బయట పడ్డాయి. వల్లభనేని వంశీ మా నాయకుడు జగన్ కాళ్ళు పట్టుకొని పార్టీ లోకి వచ్చి
అనవసరంగా నా మీద, నా అల్లుడు భరత్ రెడ్డి మీద దుష్ప్రచారం చేస్తున్నాడని దుట్టా రామచంద్ర రావు వ్యాఖ్యానించారు.
వంశీ నా అనుచరులని, అధికారులని భయపెడుతున్నాడని, 15 రోజుల్లో గన్నవరం నియోజకవర్గం ప్రజలు శుభవార్త వింటారన్నారు. జగన్ ఆదేశిస్తే గన్నవరం నుంచీ MLA గా పోటీచేస్తా ఎవడి తాటాకు చప్పుడ్లకి నేను భయపడనంటూ దుట్టా తీవ్రంగా హెచ్చరించారు.
ఇదిలా ఉండగా అధికార పక్షం లో ముందు నుండి పార్టీలో ఉన్న వాళ్ళకి కొత్తగా పార్టీలో చేరుతున్న వారి మధ్యన వర్గ పోరు రోజురోజుకూ పెరిగిపోతోందని, దీనిపై పార్టీ వర్గాలు దృష్టిసారించి సరి చేసుకోకపోతే పార్టీకి కష్టాలు తప్పవని పార్టీ కార్యకర్తలే అనుకోవడం కొసమెరుపు.
