చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడుదల రజిని పై ప్రసారమాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత? నిజంగానే ఆమె సేవ చేస్తున్నారా లేక ప్రచారం మాత్రమే చేసుకుంటున్నారా?
గత ఎన్నికల్లో వైసీపీ తరపున ఘన విజయం సాధించిన విడుదల రజిని పేరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పరిచయం అవసరం లేని పరిస్థితి గా మారింది. టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పై విజయం సాధించిన తర్వాత రజిని క్షేత్రస్థాయిలో అభివృద్ధి పై దృష్టి పెట్టారు. కరోనా సమయంలో ఆమె చేసిన సేవలు వివిధ ప్రసార మాధ్యమాల్లో ప్రచారమైన ఆవిడ వీడియోలు కు విపరీతమైన ఆదరణ రావడంతో కొంతమంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె అభిమానులు ఆరోపిస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం సత్వరమే ప్రజాసమస్యల పరిష్కారం రజిని గారి బలమని చిలకలూరిపేటలో తమ ఆధిపత్యం పోగొట్టుకున్న కొన్ని వర్గాలు కావాలని విష ప్రచారం చేస్తున్నాయని అక్కడ స్థానిక వైసీపీ నేతలు అంటున్నారు.
ఒక ప్రజా ప్రతినిధి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి తప్ప ఆమెపై వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని చిలకలూరిపేట ఎప్పటికీ విడుదల రజిని కి కంచుకోట గానే ఉంటుందని ఇకముందైనా ఎల్లో మీడియాలో ఆమెపై విష ప్రచారం ఆపాలని ఆమె అభిమానులు కోరుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉండేటువంటి నాయకులకు ఎప్పటికీ ప్రజల్లో విశ్వసనీయత ఉంటుందని రాజకీయంగా ఎదుర్కోలేని వ్యక్తులే బురద జల్లుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని రజనీ గారి అనుచరులు ఎద్దేవా చేస్తున్నారు