కోవిడ్ 19 కేసుల పెరుగుదల నేపథ్యంలో ఈ నెల 22న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎలాంటి బహిరంగ మండపాలు, విగ్రహ ప్రతిష్టలు, సామూహిక పూజలకు అనుమతించేది లేదని తమిళనాడు సర్కార్ తేల్చిచెప్పింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఒక్కరూ ఇంటిలోనే వినాయక పూజలు నిర్వహించుకోవాలని సూచించింది.
ఇప్పటి వరకూ తమిళనాడు లో మొత్తం 3,14,500 పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 2,56,313 మంది కోలుకోగా, 5278 మంది ఈ వ్యాధి బారిన పడి మరణించారు.
