వైసీపీ నరసాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణం రాజు ఆ పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని టార్గెట్ చేశారు.దీనిపై ఆయన పోలీసులకి ఫిర్యాదు చేసారు.భాద్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు
తనపై సోషల్ మీడియాలో విషప్రచారాన్ని పార్టీ ప్రోత్సహించడం తగదని మీడియాతో చెప్పారు.
అమరావతి ఉద్యమాన్ని హేళన చేస్తూ పార్టీలో కొంతమంది అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు.దీనికి ఒక వర్గానికి చెందిన వ్యక్తుల హస్తం ఉందని,వారు విచక్షణ మరిచి పెట్టే పోస్టులు మహిళల మనోభావాలని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఈ ధోరణి మార్చుకోవాలని హెచ్చరించారు.
దీనిపై వైసీపీ సోషల్ మీడియా తరపునుంచి గుర్రం పాటి దేవేందర్ రెడ్డిని భాద్యుడిగా చేస్తూ ఫిర్యాదు చేశారు.దీనిపై దేవేందర్ రెడ్డి తమ పార్టీ తరపున అధికార వెబ్సైట్లలో ఇటువంటి పోస్టులు ఎప్పుడూ పెట్టలేదని ఎవరో చేసిన పనులకు తమని భాద్యుడిగా చెయ్యడం సబబు కాదని వివరణ ఇచ్చారు. పార్టీపై ఇటువంటి దుష్ప్రచారం తగదని రాజుగారికి సూచించారు
