కోర్టు ధిక్కరణ కేసు లో న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు సుప్రీంకోర్టు నేడు శిక్ష ఖరారు చేసింది. ఆయనకు ఒక్క రూపాయి జరిమానా విధించింది. కోర్టు గౌరవానికి భంగం కలిగే విధంగా ట్వీట్లు చేసినందుకు ఆయన పై జరిగిన కేసు విచారణలో భాగంగా భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
జరిమానా విధించిన ఒక్క రూపాయి సెప్టెంబర్ 15 లోగా కోర్టుకు చెల్లించాలని చెల్లించని పక్షంలో 3 నెలల జైలు శిక్ష మూడేళ్లపాటు న్యాయవాద వృత్తి చేపట్టకుండా నిషేధం విధిస్తామని కోర్టు ఈ తీర్పులో పొందుపరిచింది.