సెప్టెంబర్ 1 నుండి లాక్ డౌన్ ఎత్తి వేస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు తెరుచుకొనే దిశగా.. ఆన్లైన్ క్లాసులు జరిగేలా విద్యాశాఖ కొన్ని మార్గదర్శకాలు చేసింది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ప్రీ స్కూల్ పిల్లలకు 45 నిమిషాలు, 1 నుండి 5వ తరగతి విద్యార్థులకు గంటన్నర, 6 నుండి 8వ తరగతి విద్యార్థులకు 2 గంటలు, 9 నుండి 12వ తరగతి వరకు 3 గంటలు, వారంలో 5 రోజులు తరగతులు నిర్వహించవలసిందిగా విద్యాశాఖ జీవో జారీ చేసింది. అయితే ప్రైవేటు స్కూల్స్ జూన్ నెల నుండి తరగతులు నిర్వహిస్తుండగా, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్ల ద్వారా విద్యార్థుల క్లాసులు జరుగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ డిజిటల్ క్లాసులు సెప్టెంబర్ 1 నుండి ప్రారంభం కానున్నాయి. స్కూల్ హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు ఖచ్చితంగా హాజరుకావాల్సిందిగా ప్రభుత్వం తెలిపింది. క్లాసుల నిర్వహణ టీశాట్, డి డి ఛానల్ ద్వారా తెలియపరుస్తుంది. అయితే రాష్ట్రంలో టెలివిజన్ సౌకర్యం 85% ఉండగా, మిగతా 15% విద్యార్థులకు, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ వద్ద స్క్రీన్ ఏర్పరచి తరగతులను బోధించనుంది.
ఇదిలా ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ నెలలో విద్యాసంస్థలు తెరవడానికి ప్రయత్నాలు చేస్తుంటే, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూళ్లు తెరిచేందుకు అనుమతించేది లేదంటూ ప్రకటిస్తున్నారు. విద్యాసంస్థల తెరవాలన్న రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అవుతుందో వేచి చూడాలి.