మహారాష్ట్ర సింధూదుర్గ్ జిల్లాలోని డారిస్టే గ్రామంలోని స్వప్నాలి సుతార్… ముంబై వెటర్నరీ కాలేజీలో చదువు…. తన గ్రామంలో ఇంటర్నెట్ సిగ్నల్స్ సరిగ్గా రాకపోవడం వల్ల Online తరగతులను మిస్ అవకూడదని తన గ్రామానికి 2 km దూరంలోని కొండపై షెడ్ ఏర్పాటు చేసుకొని తరగతులకు హాజరు అవుతుందన్న వార్త ఇటీవల సోషల్ మీడియా లో వైరల్ అయిన విషయం అందరికి తెలిసిందే.
ఈ విషయంపై నటుడు సోనూ సూద్ స్పందించి ఆ గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందిస్తాను అని కూడా స్పందించారు.
కానీ ఈ లోపే ప్రధానమంత్రి కార్యాలయం(PMO) యుధ్ద ప్రాతిపదికన ఆ విద్యార్థిని ఇబ్బందులు తోలగిస్తూ సమాచార శాఖ మరియు విద్యా శాఖలకు ఆదేశాలు పంపి …. గ్రామ పంచాయితి నుండి విద్యార్థిని ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి ఇక నుండి ఆన్లైన్ తరగతులని అంతరాయం లేకుండా పొందేటట్లు అన్ని ఏర్పాట్లు చేసి బరోసా ఇచ్చారు..మానవత్వంతో సోనూ సూద్ లాంటి వాళ్ళు స్పందించడం కంటే బాధ్యతతో ప్రభుత్వం నుండి స్పందన రావడం అనేది మంచి పరిణామం అని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఇదీ పాలన అంటే….దేశం మారుతోంది..చాప క్రింద నీరులా..నిశ్శబ్దం గా…అంటూ ప్రశంసలు వస్తున్నాయి.
