యస్ పి బాలసుబ్రహ్మణ్యం కి నెగటివ్ వచ్చింది అనే వార్త నిన్న సోషల్ మీడియాలో బాగా హల్‌చల్ చేసింది. ఆ వార్తలపై SPB కొడుకు యస్.పి.చరణ్ స్పందించారు. సోషల్ మీడియాలో నాన్న గారికి నెగటివ్ వచ్చింది అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు, నాన్న ఇంకా వెంటిలేటర్ మీదే ఉన్నారు అని తన వీడియోని ఫేస్‌బుక్ ద్వారా విడుదల చేసారు.
ఇకమీదట నాన్న గారి ఆరోగ్య సమాచారం ఏదైనా నా దగ్గరకే వస్తుంది కాబట్టి, నేను అందరికీ తెలియచేసే వరకూ ఎలాంటి మాటలు నమ్మొద్దు అని తెలిపారు చరణ్. ఇది ఇలా వుండగా 74 సంవత్సరాల బాలసుబ్రమణ్యం ఇప్పటివరకు 16 భాషల్లో 40000 పాటలు పాడారు. SPB కి ఆగష్టు 5 న కొవిడ్ పాజిటవ్ నిర్థారణ అవ్వగా, ఆగస్టు 13 న ఐసియూ కి తరలించిన సంగతి అందరికీ తెలిసిందే.