వ్యక్తి ఔన్నిత్యము, జాతి నిర్మాణము కలిస్తే అది నిజంగా వ్యక్తికి, జాతికి పనికొచ్చే ఆనందమయ, ఆరోగ్యమయ సమాజం అవుతుంది. రాజకీయ పార్టీలని వారసత్వ రాజకీయాల నుంచి అంతర్గత ప్రజాస్వామ్యం వైపు మళ్లించడం కోసం యువత పోరాడాలి.
వీటితో పాటు స్వేచ్ఛ, స్వయంపాలన, ప్రజల భాగస్వామ్యాధికారం, చట్టబద్ధ పాలన, స్వయం దిద్దుబాటు …. ఈ ఐదు కోణాల్లో సంస్కరణలతో ప్రజలను ప్రభువులుగా చేసి పాలకులను సేవకులుగా మార్చే… జన రాజకీయ, సామాజిక, ఆర్ధిక వ్యవస్థను నిర్మించడమే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి.
ఇవి సాధించడానికి ఉద్రేకంతో చేసే తాత్కాలిక ఉద్యమాలు కాకుండా, శాశ్వతంగా పరిష్కారం చూపే దిశగా మన పోరాటం ఉండాలి. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది.
అదేవిధంగా ఆనాడు తెల్లదొరల మీద పోరాడి విముక్తి సాధించాం. ఇప్పుడు మన వ్యవస్థలో పాతుకుపోయిన సాంప్రదాయ రాజకీయ వ్యవస్థ మీద కూడా పోరాడి విముక్తిని సాధించాలి.
స్వాతంత్ర్యదినోత్సవ వేళ సంబరాలు మాత్రమే కాదు…. నిర్మాణాత్మక సమీక్ష, ఆచరణాత్మక ప్రణాళిక రూపొందించుకోవాలి. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతాయని ఆశిస్తూ…
మిత్రులందరికీ 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
కూసంపూడి శ్రీనివాస్,
రాష్ట్ర అధికార ప్రతినిధి,
జనసేన పార్టీ.
