ప్రముఖ సామాజిక ఉద్యమకారులు, ఆర్యసమాజ్ నాయకులు స్వామి అగ్నివేశ్ (80) ఢిల్లీలో ఈ రోజు కన్నుమూశారు. గత కొంత కాలంగా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
ఆంధ్ర ప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో 1939 లో జన్మించిన ఆయన వెట్టిచాకిరి నిర్మూలన లాంటి అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆయన మృతి పట్ల దేశంలోని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు
