మహిళా స్వావలంబన దిశగా వ్యవసాయం, పశుపోషణ, చేనేత, హస్తకళలు, ఆహార ఉత్పత్తులు, కిరాణా దుకాణాలు, చిరు వ్యాపారాలు, చేసుకునే మహిళలకు మరింత చేయూత తెచ్చేందుకు వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి నేడు ప్రారంభించారు.
పై విధమైన వృత్తి వ్యాపారాలు చేసుకుంటున్న అక్కలకు ప్రభుత్వం సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని, చేయూత కింద ఉచితంగా అందే డబ్బుతో పాటు దీనికి అదనంగా బ్యాంకుల నుంచి, ఆర్థిక సంస్థల నుంచి, మెప్మా, సెర్ప్ పథకాల నుంచి ఆర్థిక సహాయం అందేలా ప్రభుత్వం చూస్తోందని తద్వారా చేయూత లబ్ధిదారులకు జీవనోపాధి కల్పించడం ప్రభుత్వ ధ్యేయమని ఆయన తెలిపారు.
“పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎంతోమంది చిన్న వయసులోనే భర్తను కోల్పోయి బాధపడుతూ, సరైన ఉపాధి అవకాశాలు లేని అక్కలను దగ్గర నుండి చూసాను. వారు పడుతున్న ఇబ్బంది ని గమనించి 45 ఏళ్లకే పెన్షన్ అంటే అందరూ వెటకారం చేశారు. దానికి పరిష్కార మార్గంగా నెల నెల కొంత మొత్తంగా ఇవ్వడం కంటే వైయస్ఆర్ చేయూత పథకం ద్వారా ఏడాదికి ఒకేసారి రూ.18,750ల చొప్పున నాలుగేళ్లు ఒక్కొక్కరికి రూ.75,000లు అక్కలకు ఇవ్వాలనే దృఢమైన సంకల్పంతో ఈ పథకాన్ని ముందుకు తీసుకు వచ్చాను” అని వైయస్సార్ చేయూత పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై వాక్యలు చేసారు. ఈ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని, వారి ఆర్థిక స్వావలంబనకు అండగా నిలుస్తుందని రాజన్న తనయుడిగా మాటిస్తున్నాను అని జగన్ వ్యాఖ్యానించారు