భారత్ లో 5 జీ సేవలను ప్రధాని మోదీ శనివారం, అక్టోబర్ 1 2022న ప్రారంభించనున్నారు. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడింది.
అక్టోబర్ 1న ఢిల్లీలోని ప్రగతి మైదాన్ నుంచి భారత్ లో 5జీ సేవలను ప్రధాని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, టెలీకాం కంపెనీ అధిపతులు పాల్గొనే అవకాశముంది. రిలయన్స్ నుంచి ముకేశ్ అంబానీ, ఎయిర్ టెల్ నుంచి సునీల్ మిట్టల్, వీ ఇండియా హెడ్ రవిందర్ ఠక్కర్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.