80 RTC Buses Started in Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీల అమలుకై విశేష కృషి చేస్తుంది. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించిన విషయం మనకు తెలిసిందే. దాంట్లో భాగంగానే ఆర్టీసీలో బస్సుల సంఖ్యను పెంచడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేసింది. గతంలోనే బస్సుల సంఖ్యను పెంచుతాము, కొత్త బస్సులను
తీసుకువస్తాము అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు నూతన సంవత్సరం రాబోతున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వం తను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు 80 కొత్త ఆర్టీసీ బస్సులను నూతనంగా ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటు చేసిన బస్సులలో 30 ఎక్స్ప్రెస్ బస్సులు కాగా, మరో 30

రాజధాని బస్సులు, మిగతా 20 లహరి నాన్ ఏసీ బస్సులు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు కార్మికుల సంక్షేమం కోసం ఆలోచిస్తున్నారని అదేవిధంగా ఆర్టీసీకి పెద్దపీట వేయాలని ఆలోచనలో ఆయన ఉన్నారని, ఆ దిశగానే అడుగులు వేస్తున్నారని పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ చాలా ప్రధాన పాత్ర పోషించింది.
ఆర్టీసీ సేవలను ఇప్పటివరకు మేము మర్చిపోలేము. ఆర్టీసీని ఇంకా అభివృద్ధి చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాంట్లో భాగంగానే రానున్న రోజులలో 1000 ఎలక్ట్రిక్ బస్సులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తీసుకువస్తుందని పొన్నం ప్రభాకర్ గారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నూతన విధివిధానాలను, ప్రజా సంక్షేమ ఆలోచనలను చూసి ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.
