ఆదివారం ఉదయం 8:05 నిమషాలకి థాయిలాండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ కి 50 మైళ్ళ దూరం అత్యంత విషాదకరమైన ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం లో 20 మంది ప్రయాణికులు అక్కడిక్కడే మృతిచెందగా మరో 30 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం, అందరూ కూడా ఒక ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులే. అయితే కార్మికులు అందరూ బుద్దమతం కి సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇలా ఒక ప్రవేటు ట్రావెల్స్ కి సంబంధించిన వాహనం మాట్లాడుకుని బయలుదేరారు అని లోకల్ లో ఉండేవారు చెప్తున్నారు.
కాగా, ప్రమాదం జరిగిన టైంలో కొద్దిపాటి వర్షం పడుతుంది అని, ఆ లెవల్ క్రాసింగ్ వద్ద ఎలాంటి సిగ్నల్ వ్యవస్థ కానీ, రైల్వే గేటు కానీ లేకపోవడమే కాకుండా రైలు బండి హారన్ కూడా సరిగా వినిపించే వాతావరణం పరిస్థితులు లేవని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.
థాయిలాండ్ లోని రోడ్ల వ్వవస్థ పై ఎప్పటినుండో ఆ దేశ గవర్నమెంట్ మీద విమర్శలు ఉన్నాయి. అయితే విమర్శలకి తగ్గట్టు ఇవాళ ఘోర ప్రమాదంలో అమాయక కార్మికులు బలై పోయారు.