విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో ఉన్న కోవిడ్ కేర్ సెంటర్ లో అగ్నిప్రమాదం జరిగి 11 మంది రోగులు మృత్యువాత పడ్డారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని పవన్ కళ్యాణ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆయన తన తరపున జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
రమేష్ హాస్పటల్ అనుబంధంగా నడుస్తున్న ఈ కోవిడ్ కేంద్రంలో రక్షణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటే అత్యవసర మార్గాల ద్వారా బయట పడే వ్యవస్థలు ఎలా ఉన్నాయి? లోపాలు ఏమిటో సమగ్రంగా విచారణ చేయించాలి అనీ, ఈ ఘటన నేపథ్యంలో వివిధ హోటల్స్ భవనాల్లో నడుస్తున్న కోవిడ్ కేంద్రాల్లో రక్షణ చర్యల పై ప్రభుత్వం సమీక్ష నిర్వహించాలని కోరుతూ పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.