Kingdom Movie: ‘కింగ్డమ్’లో విలన్‌గా మెప్పించిన వెంకిటేశ్.. సినిమా చూసి ఏడ్చేసిన అమ్మ!
Kingdom Movie: విజయ దేవరకొండ కింగ్డమ్ మూవీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. మిక్స్‌డ్ టాక్ అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం లాంగ్ రన్ చూస్తోంది. కింగ్డమ్ చిత్రంలో విలన్ పాత్ర విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కేరళకు చెందిన ఈ నటుడు తన విలనిజంతో విజయ్ దేవరకొండను సైతం మైమరిపించాడు.
విలన్‌గా నటించిన నటుడు వెంకిటేశ్, సినిమా ప్రమోషన్లలో తన తల్లి గురించి మాట్లాడి అందరినీ భావోద్వేగానికి గురిచేశారు. గతంలో చాలా సంవత్సరాలపాటు సహాయ నటుడిగా, ఇతర పాత్రలు పోషించిన తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ఇన్నేళ్ల తరువాత తాను ఒక మంచి పాత్రలో నటించానని, తన తల్లి తనను చూసి గర్వపడుతున్నారని చెప్పారు. తన తల్లికి తాను నటించిన సినిమా నచ్చడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ సినిమా తన జీవితంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని తెలిపారు. ఈ మాటలు సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ప్రేక్షకుల హృదయాలను తాకాయి.
పడిపోయిన కలెక్షన్లు..
విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ‘కింగ్డమ్’ సినిమా కలెక్షన్లు బాక్సాఫీస్ వద్ద పడిపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం.. విడుదలైన మొదటి వారాంతంలో మంచి వసూళ్లను సాధించినప్పటికీ, ఆ తర్వాత వసూళ్లు పడిపోయాయి. తమిళనాడులో ఈ సినిమాపై జరిగిన నిరసనలు, నిషేధం డిమాండ్ల కారణంగా సోషల్ మీడియాలో వ్యతిరేకత పెరిగి, తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపింది.
మొదటి ఆరు రోజుల్లోనే సినిమా కలెక్షన్లలో భారీ క్షీణత కనిపించింది. ఆరో రోజున కేవలం 20 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడవగా, దేశవ్యాప్తంగా కేవలం 1.75 కోట్ల రూపాయలు మాత్రమే వసూలయ్యాయి. ఇందులో ఆంధ్ర, నైజాం ప్రాంతాల నుంచి 1.5 కోట్ల రూపాయలు వచ్చాయి. సినిమా లాభాల బాట పట్టాలంటే మరో 10 కోట్ల షేర్, 20 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంది. మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ సినిమా కలెక్షన్ల వేటలో వెనకబడింది. మహావతార్ నరసింహా బాగా కలెక్షన్లు సాధిస్తుండటంతో ఆ ప్రభావం కింగ్డమ్‌పై పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.