Vishal Engagement: పుట్టినరోజు నాడే.. నటి సాయి ధన్సికతో విశాల్ ఎంగేజ్‌మెంట్
Vishal Engagement: తమిళ స్టార్ నటుడు విశాల్ తన వ్యక్తిగత జీవితంలో ఒక శుభవార్తను పంచుకున్నారు. నేడు తన పుట్టినరోజు సందర్భంగా తన ప్రేయసి, నటి సాయి ధన్సికతో నిశ్చితార్థం చేసుకున్నారు. చెన్నైలోని విశాల్ నివాసంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక నిరాడంబరంగా జరిగింది. ఈ సంతోషకరమైన క్షణాలను విశాల్ స్వయంగా తన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
నిశ్చితార్థం తర్వాత విశాల్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేస్తూ, “నా పుట్టినరోజు సందర్భంగా నన్ను ఆశీర్వదించిన ప్రపంచంలోని నా అభిమానులు అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు మా రెండు కుటుంబాల మధ్య సాయి ధన్సికతో నా నిశ్చితార్థం గురించి శుభవార్తను మీ అందరితో పంచుకోవడం ఆనందంగా ఉంది. ఎప్పటిలాగే మీ ఆశీస్సులు, ప్రేమ మాపై ఉండాలని కోరుకుంటున్నాను” అని రాసుకొచ్చారు.
కాగా, విశాల్, సాయి ధన్సికల మధ్య గత కొన్ని రోజులుగా ప్రేమాయణం నడుస్తోందని వార్తలు వచ్చాయి. ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌లో వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించి, త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపారు. కబాలి సినిమాలో రజనీకాంత్ కుమార్తెగా నటించి సాయి ధన్సిక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు, సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తెలుగులో ‘పందెం కోడి’తో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు. ఆ తర్వాత విశాల్ నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతూ వస్తున్నాయి. గత 15 యేళ్లుగా తమిళంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా రాణిస్తున్నాడు. ఈయన స్వతహాగా తెలుగు వాడు కావడంతో ఇక్కడ డబ్బైన ప్రతి చిత్రంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక విశాల్ గత కొన్నేళ్లుగా వివాహా ప్రయత్నాలు చేసినా ఎందుకో వర్కౌట్ కాలేదు.
ఇక సినిమాల విషయానికి వస్తే, విశాల్ ప్రస్తుతం రవి అరసు దర్శకత్వంలో ‘మకుటం’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అంజలి, దుషార విజయన్‌లు కథానాయికలుగా నటిస్తుండగా, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆర్.బి. చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన లభించింది.