Actress Jayaprada is Missing : అలనాటి సినీతార జయప్రద మిస్సింగ్ అంటూ కొన్ని వార్తలు నెటింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తల్లో నిజం ఎంత అనేది ఇప్పుడు అందరూ ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా జయసుధ మిస్సింగ్ అంటూ వస్తున్న వార్తలు చూసి ఆమె అభిమానులు అలాగే, చాలామంది జయప్రదకు ఏం జరిగిందో అని ఆందోళనలో ఉన్నారు. కానీ వివరాల్లోకి వెళితే..
ప్రముఖ నటి అలాగే బీజేపీ నేత అయినటువంటి జయప్రద కనిపించడం లేదని పోలీసులు ఒక స్టేట్మెంట్ ని ఇచ్చారు. ఆమె కోసం వెతుకుతున్నామన్నట్టు పోలీసులు వెల్లడించారు. జయప్రద కనిపించకుండా పోవడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన కేసులో జయప్రద నిందితురాలు అని పోలీసులు తెలిపారు.

ఈ కేసుకు సంబంధించి గతంలో విచారణకు హాజరుకావాలని కోర్టు జయప్రదను చాలాసార్లు హెచ్చరించింది. అయినప్పటికీ జయప్రద కోర్టు ఆదేశాలను ఖాతరు చేయలేదు. జయప్రద ప్రవర్తన వల్ల ఆమె పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కోర్టు జనవరి 10వ తేదీన ఎలాగైనా సరే జయప్రదను కోర్టుల హాజరు పరచాలని పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక రాంపూర్ పోలీసులు జయప్రదను వెతికి పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.
