Actress Poorna: 5 రోజులుగా నరకం, నీ టార్చర్ వల్ల రోజూ ఏడుస్తున్నా: నటి పూర్ణ భర్త షాకింగ్ పోస్ట్
Actress Poorna: తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ అసలు పేరు షామ్నా ఖాసిం. ‘సీమటపాకాయ్’, ‘అవును’, ‘అఖండ’, ‘దసరా’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఆమె మరింత చేరువయ్యారు. కేరళలో డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత నటిగా మారిన పూర్ణ, ప్రస్తుతం హీరోయిన్ పాత్రలకు బదులుగా కీలక పాత్రల్లో నటిస్తూ, తన హవాను కొనసాగిస్తున్నారు. బుల్లితెరపైనా ‘ఢీ’, ‘సిక్స్త్ సెన్స్’ వంటి షోలకు హోస్ట్‌గా వ్యవహరించి ఆమె తన బహుముఖ ప్రజ్ఞను నిరూపించుకున్నారు.
2022లో దుబాయ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని పెళ్లి చేసుకున్న పూర్ణ, 2023లో ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. పెళ్లి, బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆమె నటిగా, జడ్జిగా తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు తన భర్త నుంచి పూర్తి సహకారం లభిస్తుందని పలు సందర్భాల్లో పూర్ణ తెలిపారు. అయితే, తాజాగా పూర్ణ భర్త సోషల్ మీడియాలో చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
షూటింగ్స్ నిమిత్తం గత 45 రోజులుగా పూర్ణ తన భర్తకు దూరంగా ఉన్నారు. ఈ ఒంటరితనాన్ని భరించలేకపోయానని, రాత్రిపూట ఆమె జ్ఞాపకాలతో గడిపానని, ప్రతిరోజూ ఉదయం ఆమెను తలచుకుని ఏడ్చేవాడినని షానిద్ తన పోస్టులో పేర్కొన్నారు. “ఈ 45 రోజులు ప్రేమ గొప్పదనం నాకు తెలిసొచ్చింది. మనల్ని ప్రేమించేవారు మనతో ఉండటమే నిజమైన వరం” అని ఆయన రాసుకొచ్చారు.
ఎట్టకేలకు తన భార్య పూర్ణ తిరిగి తన దగ్గరకు వచ్చిందని, ఆమెను కలుసుకున్నప్పుడు ఆనందంతో కన్నీరు ఆగలేదని షానిద్ వెల్లడించారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు వారి మధ్య ప్రేమ బంధాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఈ పోస్టులోని ఆవేదనను తప్పుగా అర్థం చేసుకున్న కొంతమంది నెటిజన్లు వీరిద్దరూ విడిపోతున్నారంటూ ఊహాగానాలు చేయడంతో, షానిద్ వెంటనే స్పందించి ఆ పుకార్లకు చెక్ పెట్టారు. “నా భార్యతో నేను సంతోషంగా ఉన్నాను. దయచేసి తప్పుడు ప్రచారం చేయొద్దు” అని ఆయన విజ్ఞప్తి చేశారు.