Pragathi Mahavadi: పవర్ లిఫ్టింగ్‌లో అదరగొట్టిన నటి ప్రగతి.. నేషనల్స్‌లో ఏకంగా గోల్డ్ మెడల్
Pragathi Mahavadi: టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు కథానాయికగా, ఆ తర్వాత తల్లి, వదిన వంటి సహాయక పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రగతి, ఇప్పుడు క్రీడా రంగంలో తన ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా కేరళలో జరిగిన నేషనల్ మాస్టర్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 50 ఏళ్ల వయసులోనూ పవర్ లిఫ్టింగ్‌లో ఆమె సాధించిన ఈ విజయం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
కృషి + పట్టుదల = ఫలితం..
2024లో జరిగిన సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన ప్రగతి, ఇప్పుడు జాతీయ స్థాయిలో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ పోటీల్లో ఆమె స్క్వాట్ విభాగంలో 115 కిలోలు, బెంచ్ ప్రెస్లో 50 కిలోలు, డెడ్‌లిఫ్ట్లో 122.5 కిలోలు ఎత్తి మొత్తం మూడు పతకాలను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ప్రగతి తన సోషల్ మీడియాలో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. “అభిరుచి, క్రమశిక్షణ వంటివి మాత్రమే దీనికి అవసరం. నా కోచ్‌కి ప్రత్యేక ధన్యవాదాలు” అంటూ ఆమె భావోద్వేగంగా పోస్ట్ చేశారు. ఆమె పోస్టుకు అభిమానులు, సహచర నటీనటులు పెద్ద సంఖ్యలో అభినందనలు తెలియజేస్తున్నారు. “హ్యాట్సాఫ్”, “రియల్లీ గ్రేట్” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
https://www.instagram.com/reel/DM7uSlFS5RO/?utm_source=ig_web_copy_link
కరోనా సమయంలో ఫిట్‌నెస్ జర్నీ..
కరోనా లాక్‌డౌన్ సమయంలో ప్రగతి తన ఫిట్‌నెస్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సోషల్ మీడియాలో తన వర్కవుట్‌లకు సంబంధించిన వీడియోలను తరచూ షేర్ చేస్తూ, యువతకు కూడా స్ఫూర్తిగా నిలిచారు. ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, అడపాదడపా ప్రాజెక్టుల్లో కనిపిస్తున్నారు. ఈ వయసులో కూడా పట్టుదలతో క్రీడల్లో రాణించి గోల్డ్ మెడల్ సాధించడం ఆమె సంకల్పానికి నిదర్శనం. ప్రగతి సాధించిన ఈ విజయం ఆమె అభిమానులకు మరింత ఆనందాన్నిచ్చింది.