Samantha Ruth Prabhu: లగ్జరీ వాచ్‌తో సమంత.. ఎన్ని లక్షలో తెలిస్తే షాక్ అవుతారు..
Samantha Ruth Prabhu: తనదైన నటనతో తెలుగు, తమిళ పరిశ్రమల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి సమంత, ఇప్పుడు తన స్టైలిష్ ఫ్యాషన్ సెన్స్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమాల కన్నా ఎక్కువగా బ్రాండ్ల ప్రమోషన్స్‌లో కనిపిస్తూ సోషల్ మీడియాలో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సామ్, తాజాగా ధరించిన ఒక లగ్జరీ వాచ్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వాచ్‌కు సంబంధించిన ఫోటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతుండగా, నెటిజన్లు ఆ వాచ్ బ్రాండ్, దాని ధర గురించి ఆరా తీస్తున్నారు.
సమంత ధరించిన ఈ వాచ్ ట్రాపెజ్డ్ ఆకారంలో ఉండే పియాజెట్ 60 జువెలరీ వాచ్ అని తెలుస్తోంది. మార్కెట్‌లో దీని ధర సుమారు రూ.30 లక్షల పైనే ఉంటుందని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. గతంలో కూడా సమంత ఇలాంటి ఖరీదైన వాచ్‌లను ధరించి వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా ఆమె ఎక్కువగా ధరించే బల్గారీ సర్పెంటీ వాచ్ ధర రూ.45 లక్షల పైనే ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
సినిమాల విషయానికి వస్తే, సమంత ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న “మా ఇంటి బంగారం” చిత్రంలో నటిస్తున్నారు. అలాగే, రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందుతోన్న వెబ్ సిరీస్ “రక్త బ్రహ్మాండ్”లోనూ తన నటనతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
మరోవైపు, సమంత వ్యక్తిగత జీవితం కూడా ఇటీవల చర్చనీయాంశంగా మారింది. దర్శకుడు రాజ్ తో ఆమె ప్రేమ వ్యవహారం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఇటీవల వీరిద్దరూ ముంబైలోని ఒక జిమ్ నుంచి కలిసి బయటకు రావడం, ఒకే కారులో వెళ్లడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఈ వార్తలపై సమంత కానీ, రాజ్ కానీ అధికారికంగా స్పందించలేదు.