Adani is the Richest Person in the Country : ప్రపంచ కుబేరులుగా పేరుపొందిన ప్రముఖ వ్యాపారవేత్తలు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా వారిలో మనకు ప్రముఖంగా మొదటగా వినిపించే పేరు బిల్ గేట్స్, ఆదాని, అంబానీ ఇలా కొన్ని పేర్లు మనకు తెలుస్తాయి. అయితే రోజువారి లెక్కల ప్రకారం బిజినెస్ లో వచ్చే లావాదేవీల ప్రకారం ఈ మార్కు మారుతూ వస్తుంది. ఈరోజు ధనవంతులుగా నెంబర్ వన్ స్థానంలో ఒకరు ఉంటే, మరో రోజు వారిని వెనుకకు నెట్టి ఇంకొకరు ఉంటారు.
ఇలా ఎప్పటికప్పుడు ఈ మొదటి స్థానం అనేది రూపాంతరం చెందుతూనే ఉంటుంది. ఈరోజు లెక్కల ప్రకారం ముఖేష్ అంబానీని వెనుకకు నెట్టి, అదాని మొదటి ప్లేస్ లో ఉన్నారని తెలుస్తుంది. ఇంకా వివరాల్లోకి వెళితే..

ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి గౌతమ్ అధాని ఇప్పటివరకు మొదటి స్థానంలో ఉన్నటువంటి ముఖేష్ అంబానీని వెనుకకు నెట్టి ప్రపంచ కుబేరుడు గా నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. దీనికి ప్రధాన కారణం ఆదానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును ఇవ్వడమే.. ఈ తీర్పును నేపథ్యంలో ఆదాని షేర్లు గణనీయంగా ఒకేసారి పెరిగాయి.
ఆ లెక్కల ప్రకారం ఈరోజు ఉదయానికి ఆదాని సంపద 97.6 బిలియన్ డాలర్లుగా నమోదయింది. ఈ విషయాన్ని బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. ఆదాని మొదటి ప్లేస్ లోకి చేరుకునే సమయానికి ముకేశ్ అంబానీ ఆదాయం 97 బిలియనీర్ల దగ్గర ఆగిపోయింది. ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే ప్రపంచ సంపన్నుల పట్టికలో గౌతమ్ ఆదాని 12వ స్థానాన్ని చేజిక్కించుకోగా.. ముకేశ్ అంబానీ 13వ స్థానంలో ఉన్నారు.
