ఇవాళ దేశ రాజధాని ఢిల్లీ మరియూ పరిసరప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా తక్కువ నమోదు అయ్యయి అంటూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది.
అయితే ప్రతీ సంవత్సరం శీతాకాలంలో దేశ రాజధానిలో ఎయిర్ క్వాలీటీ చాలా తక్కువగా నమోదు అవ్వడం అనేది గత ఐదేళ్లుగా సాధారణంగా మారింది. కానీ ఈ సంవత్సరం కరోనా దెబ్బతో పొల్యూషన్ చాలావరకు కంట్రోల్ అవుతుంది అనుకున్నారు రాజధాని ప్రజలు.
ఎందుకంటే గత ఆరు నెలలుగా కరోనా వల్ల జనజీవనం అస్తవ్యస్తం అవ్వడం వల్ల బెంగళూరు పూణే హైదరాబాద్ విశాఖపట్నం వంటి చాలా మెట్రో సిటీల్లో కంట్రోల్ అయినట్టు వార్తలు వచ్చాయి.
కానీ అందుకు భిన్నంగా నిన్న మంగళవారం ఢిల్లీ మరియూ పరిసర ప్రాంతాలలో మెజారిటీ చోట్ల ఎయిర్ క్వాలిటీ ఈ సీజన్ లో అత్యంత దారుణంగా పతాక స్థాయికి చేరింది.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ విడుదలచేసిన లెక్కల ప్రకారం, ఢిల్లీలో మొత్తం 36 పొల్యూషన్ రీడింగ్ స్టేషన్లు ఉంటే 19 చోట్ల ఎయిర్ క్వాలిటీ 301-400(Very Poor) మధ్య నమోదు అయింది.
14 చోట్ల ఎయిర్ క్వాలిటీ 201-300 మధ్య నమోదు అయింది.
నార్త్ వెస్ట్ ఢిల్లీ లోని వాజిపూర్ లో అత్యధిక కంగా AQI లో 379 నమోదు అయింది. రాజధాని కేంద్రంలో 190 గా నమోదు అయినట్టు కంట్రోల్ బోర్డు ప్రకటించింది.
నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్ ఇలా అన్ని చోట్లా ఎయిర్ క్వాలిటీ చాలా దారుణంగా పడిపోయింది.
అయితే ఎయిర్ క్వాలిటీ పడిపోవడానికి గల కారణాలు చూస్తే ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా మరియు పాకిస్థాన్ బోర్డర్ లో రైతులు పంటలు అయిపోయాక మిగిలిన గడ్డిని తగులపెట్టడమే అని చెప్తున్నారు పొల్యూషన్ బోర్డు అధికారులు.