దాదాపు ఆరు నెలల లాక్‌డౌన్ తరవాత ఎయిర్ ఇండియా కెనడా-ఇండియా మధ్య బుకింగ్స్ ఓపెన్ చేసింది. 2020 అక్టోబర్ 27 నుండి 27 మార్చి 2021 వరకూ బుకింగ్స్ ఓపెన్ చేసారు.
ఢిల్లీ నుండి టొరాంటో మధ్య మంగళ, గురు,శుక్ర, శని మరియూ ఆదివారాలలో ప్లైట్స్ అందుబాటులో ఉన్నాయి.
అలాగే ఢిల్లీ-వాంకోవర్ మధ్య వారానికి మూడు రోజులు బుధ , శుక్ర, శని వారాల్లో విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
అయితే ఈ ప్లైట్స్ అన్నీ కూడా రెగ్యులర్ సర్వీసులు అయితే కాదు, స్పెషల్ సర్వీసులలో భాగంగా వీటిని అందుబాటులో ఉంచినట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది.
త్వరలో సాధారణ అంతర్జాతీయ సర్వీసులు మొదలవుతాయా?
కరోనా వైరస్ ప్రభావంతో మార్చి 22 న మూతపడిన సాధారణ అంతర్జాతీయ విమాన సర్వీసులు ఇప్పటి వరకూ మొదలుకాలేదు. అయితే ఇప్పుడు ఎయిర్ ఇండియా బుకింగ్స్ మొదలుపెట్టేసరికి రాబోయే రోజుల్లో సాధారణ సర్వీసులు మొదలుపెట్టడానికి ఎయిర్‌లైన్స్ ఇప్పుడిప్పుడే సన్నద్ధం అవుతున్నట్టు అనిపిస్తుంది.
సాధారణ సర్వీసులు ఎప్పుడు మొదలవుతాయో చూడాలి..!