Airplane : విమానం దీని గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. అందరూ దీంట్లో ప్రయాణం చేయలేకపోయినా ఎదో ఒక సందర్భంలో చూస్తూనే ఉంటారు. అయితే విమానం గురించి మనకు తెలియని కొన్ని విషయాలు..అవేంటో చూద్దాం.
విమానం టేకాఫ్ అయ్యే ముందు ఇంజన్ పై కోళ్లను విసురుతారు అని ఒక ప్రచారం ఉంది. విమానం ఇంజన్ లోకి కోళ్లను ఎందుకు విసురుతారు..ఇది నిజంగా చేస్తారా.. లేక వట్టి పుకార్ల.. దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కోణం ఉందా.. కోళ్లను విమానం ఇంజన్ లోకి విసరడం అనేది నిజం. ఇలా చేయడం వెనక ఒక కారణం దాగి ఉంది. విమానం నీ పరీక్షించడానికి ఇలా చేస్తూ ఉంటారంట.
విమానంపై పక్షి ప్రభావాన్ని పరీక్షించడానికి ఈ విధమైన ప్రక్రియను ఎంచుకున్నారు. విమానం రెక్కలను కొట్టి పరీక్షించడానికి ఈ పరీక్ష చాలా అవసరం. ఎందుకంటే విమానం గాలిలో ఉన్నప్పుడు లేదా టేక్ఆఫ్ అవుతున్నప్పుడు దానియొక్క ఫ్యాన్లు లేదా ఇంజన్ ల తరచుగా కొన్ని పక్షులతో తాకుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి సమయంలో ఏ విధమైన ప్రమాదం
జరగకుండా ఏవియేషన్ అధికారులు ఇలాంటి జాగ్రత్త తీసుకుంటారు. అన్ని కోళ్లను ఎలా విసురుతారు అంటే. ఈ పరీక్ష కోసం పక్షి తుపాకీ లేదా పక్షి ఫిరంగి నీ ఉపయోగిస్తారు. దీంట్లో చాలా కోళ్లు వేయవచ్చు. అలా ఒక్కసారిగా ఫ్లైట్ ఇంజన్ లోకి కోళ్లను గుంపులుగా ఎగరవేస్తారు. ఆ సమయంలో ఇంజన్ తట్టుకోగలదో లేదో పరీక్షిస్తారు.
ఇది విండ్ షీల్డ్ ఇంజన్ రెండింటిలోనూ జరుగుతుంది. అయితే నివేదికల ప్రకారం ఈ రకమైన పరీక్ష మొట్టమొదటిసారిగా 1950లో బ్రిటిష్ ఎయిర్ లైన్స్ పైలెట్ అసోసియేషన్ వారు నిర్వహించినట్టు తెలుస్తుంది. ఈ ప్రక్రియలో చనిపోయిన కోళ్లను ఇంజన్ లో మంటలు అంటుకుంటున్నాయో లేదో చూడడానికి ఉపయోగించేవారు.
దీనికోసం రెండు నుండి నాలుగు కిలోల కోళ్లను విండ్ షీల్డ్ లోకి విసిరేవారు. టేకప్ కు సంబంధించి ఇది చాలా ముఖ్యమైన పరీక్ష. ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పరీక్ష. దీన్ని సాధారణంగానే మనం పరిగణనలోకి తీసుకోవాలి. టేక్ ఆఫ్ ట్రస్ట్ సమయంలో ఈ పరీక్షను నిర్వహిస్తూ ఉంటారు.