Pragya Jaiswal: ‘అఖండ 2’ సినిమా ఆలస్యంపై హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ క్లారిటీ.. ఏం చెప్పిందంటే?
Pragya Jaiswal: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)తో ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నటి ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) మరోసారి వెండితెరపై మెరవడానికి సిద్ధమవుతున్నారు. ‘అఖండ 2’ చిత్రంతో ఆమె మళ్ళీ బాలకృష్ణ సరసన నటిస్తున్నారని, ఈ సినిమా విడుదల తేదీలో స్వల్ప మార్పులు జరిగాయని సమాచారం. ఈ విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ‘అఖండ 2’ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కావాల్సి ఉంది. అయితే, కొన్ని సాంకేతిక కారణాల వల్ల సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ‘కంచె’ వంటి విభిన్న చిత్రాలతో గుర్తింపు పొందిన ప్రగ్యా, ‘అఖండ’ లోని తన పాత్రతో మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. ఇటీవల ‘డాకూ మహారాజ్’ చిత్రంలోనూ ఆమె బాలకృష్ణ సరసన నటించి విజయాన్ని అందుకున్నారు. కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ, తన కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.
సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన వ్యక్తిగత జీవితం, ఫొటోషూట్‌లను అభిమానులతో పంచుకుంటూ వారిని అలరిస్తుంటారు. ఇటీవల ఆమె షేర్ చేసిన ట్రెండీ అవుట్‌ఫిట్‌లోని ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, ఆమె చిరునవ్వు, స్టైలిష్ లుక్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఒకవైపు ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తూనే, మరోవైపు వ్యక్తిగత జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న ప్రగ్యా, ప్రస్తుతం బాలకృష్ణతో ‘అఖండ 2’ లోని తన పాత్రపై అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నారు.
కాగా.. అఖండ్ 2 సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అఖండ-2 డిజిటల్ స్ట్రీమింగ్ 0హక్కులను సొంతం చేసుకుంది. ఈ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ రూ. 80 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
